చిరంజీవి తాజా సినిమా టైటిల్ ఖరారు
- February 07, 2020
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. సందేశాత్మక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది.
మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అని టైటిల్ ఖరారైనట్లు ఆ వార్తల సారాంశం.
దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్లో ఆచార్య అని టైటిల్ కూడా రిజిస్టర్ అయింది అని కూడా ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో మెగాస్టార్ ప్రొఫెసర్ పాత్రలో కన్పించనున్నాడు. గతంలో వచ్చిన మాస్టర్,ఠాగూర్ తర్వాత చాలా ఏళ్లకు చిరు ప్రొఫెసర్ పాత్రలో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!