యూ.ఏ.ఈ:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారి బంపర్ ఆఫర్
- February 07, 2020
దుబాయ్:యూ.ఏ.ఈ లో భారతీయులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ శుభవార్త చెప్పింది.యూ.ఏ.ఈ లో ఉంటున్న వారి కోసం ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించిన సంస్థ.. తక్కువ ఖర్చుతో ఇండియాకు వచ్చేందుకు వీలు కల్పించింది. కేవలం 269దిర్హామ్స్ తో షార్జా నుంచి ముంబాయికు ప్రయాణించొచ్చని వెల్లడించింది.అంతేకాకుండా.. దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ , దుబాయ్/షార్జా - కొజికోడ్ టికెట్ ధర 279 దిర్హామ్స్‌గా నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ప్రకటించింది.అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ తేదీల మధ్య టికెట్‌ను బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణించొచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







