ఒమన్:టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు..ప్రకటించిన నిర్వాహకులు

- February 07, 2020 , by Maagulf
ఒమన్:టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు..ప్రకటించిన నిర్వాహకులు

ఒమన్:టూర్ ఆఫ్ ఒమన్ రేస్ 11వ ఎడిషన్ రద్దు చేస్తున్నట్లు రేస్ నిర్వాహక సంస్థ అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్-ASO ప్రకటించింది.  ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం టూర్ ఆఫ్ ఒమన్ 11వ ఎడిషన్ ఈ నెల 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. అయితే..జనవరి 10న ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మరణించటంతో ఫిబ్రవరి 21 వరకు సంతాప దినాలుగా ప్రకటించారు. దీంతో 11వ ఎడిషన్ టూర్ ఆఫ్ ఒమన్ రేస్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 2021లో జరిగే టూర్ ఆఫ్ ఒమన్ రేస్ లో కలుద్దామంటూ నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com