యూఏఈ SWAT ఛాలెంజ్ 2020కి రెడీ అంటున్న దుబాయ్ పోలీస్
- February 07, 2020
యూఏఈ:ట్రైనింగ్ సిటీ అల్ రువయ్యలో యూఏఈ SWAT ఛాలెంజ్ 2020 సెకండ్ ఎడిషన్ హోస్ట్ చేసేందుకు దుబాయ్ పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 30 దేశాల నుంచి 54 టీమ్స్
ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. బందీలను విడిపించటం, గాయపడిన అధికారులను రక్షించటం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటం వంటి సవాళ్లను అధిగమించటం
వంటి ఈవెంట్లు ఈ ఛాలెంజ్ లో ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాన మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో దుబాయ్ పోలీసులు యుఎఇ స్వాట్ ఛాలెంజ్ 2020ని నిర్వహించనున్నారు. దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి ఛాలెంజ్ నిర్వహణకు ఫోర్సెస్ ఎలా సిద్దమయ్యారో పరిశీలించారు. స్వాట్ ఛాలెంజ్ 2020కి వేదికయ్యే లోకేషన్ ను తనిఖీ చేశారు. ఫోర్సెస్ ట్రైనింగ్ అవుతున్న తీరును కాసేపు వీక్షించారు. ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసే అన్ని జట్లకు అన్ని రకాల సాయం అందించటంతో పాటు వారికి నిబంధనలకు సంబంధించి అన్ని జట్లు అవగాహన కల్పించాలని ఆర్గనైజర్లకు ఆయన సూచించారు. స్వాట్ ఛాలెంజ్ కు దుబాయ్ పోలీసులు రెడీ అవుతున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి..యూఏఈ, యూఎస్ఏకు చెందిన 34 మంది సభ్యుల జడ్జి ప్యానెల్ తో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!