ఫోరెన్సిక్‌ టీమ్ చలవతో మర్డర్‌ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి

- February 08, 2020 , by Maagulf
ఫోరెన్సిక్‌ టీమ్ చలవతో మర్డర్‌ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి

దుబాయ్:ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఈ ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదయ్యింది. 30 ఏళ్ళ వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. 50 ఏళ్ళ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే, తన మీద ఆ 50 ఏళ్ళ వ్యక్తి దాడి చేశారనీ, తాను అతనిపై దాడి చేయలేదనీ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణను లోతుగా పరిశీలించిన అధికారులు, ఫోరెన్సిక్‌ టీమ్ అందించిన వివరాల్ని విశ్లేషించారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో, 50 ఏళ్ళ వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలున్నాయనీ, గొడవ జరగడానికంటే ముందే అతను గుండె నొప్పితో బాధపడుతున్నాడనీ, అయితే గొడవ జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆ గలాటాలో ప్రాణాలు కోల్పోయాడు తప్ప, 30 ఏళ్ళ వ్యక్తి అతని మీద ఎలాంటి దాడీ చేయలేదని తేలింది. దుబాయ్‌ పోలీస్‌ అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com