కరోనా వైరస్: చైనాలో ఒక్క రోజే 88 మంది మృతి
- February 09, 2020
ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్.. వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో దీని బారిన పడి నిన్న ఒక్క రోజే 88 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఒక్క చైనాలోనే 811 మంది మరణించగా.. ప్రపంచ వ్యాప్తంగా 37,155 కేసులు నమోదు కాగా, 6,109 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజాగా డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకూ 28 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది.
గతంలో సార్స్ బారిన పడి చైనా, హాంకాంగ్ మృతిచెందిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ కావడం భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వుహాన్ ఇంకా అష్టదిగ్బంధంలోనే ఉన్నాయి. కరోనా బారిన పడితే బ్రతుకుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్‌కు దేశాలన్ని భయపడుతున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!