ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న పుల్లెల గోపీచంద్
- February 09, 2020
పుల్లెల గోపీచంద్.. ప్రపంచ టైటిళ్లను అవలీలగా సాధించే ప్లేయర్లను తయారు చేయగలగడం ఆయనకే ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్ని బ్యాడ్మింటన్ శిక్షణ సంస్థలు ఉన్నా.. గోపీచంద్ అకాడమీకి క్రీడాకారులు ఇచ్చే గౌరవం వేరు. అందుకే.. అతనంటే అందరికీ అంత గౌరవం.
ఆయన శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్, సింధుతో పాటు మరెంతో మంది క్రీడాకారులు.. బ్యాడ్మింటన్ లో సంచలనాలు సృష్టంచారు. ఇప్పుడు గోపీచంద్ కూడా.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా గోపీచంద్ గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు దక్కిన పురస్కారాన్ని భారతీయ కోచ్ లందరికీ దక్కినట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.
తనకు ఈ స్థాయి దక్కడంలో కారణాలుగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్, కేంద్రం, క్రీడా మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ లకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాడ్మింటన్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా.. గోపీచంద్ కు 2019 ఐవోసీ జీవిత సాఫల్య కోచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







