అఘోరాగా కనిపించనున్న బాలకృష్ణ
- February 09, 2020
ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది డబుల్‌మాసే. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఆల్రెడీ వచ్చిన 'సింహా' (2010), 'లెజెండ్' (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో మూవీ రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 26 నుంచి వారణాశిలో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించే బాలయ్య, ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ టాక్.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య లుక్ ను మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి, అందుకోసం మరింత సమయాన్ని ఇస్తూ, కాస్తంత ఆలస్యమైనా ఫిల్మ్ పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ఇక చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం.ఇందులో ఇద్దరు కథానాయికలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రియ, నయనతార కథానాయికలని ప్రచారం జరుగుతుండగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







