డెత్‌వారెంట్ జారీ చేసిన 'రమికా సేన్' ఈమె

- February 09, 2020 , by Maagulf
డెత్‌వారెంట్ జారీ చేసిన 'రమికా సేన్' ఈమె

యష్ హీరోగా, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సైలెంట్‌గా వచ్చిన `కేజీఎఫ్' సంచలనం సృష్టించింది.. తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో అందరి చూపు ఇప్పుడు రెండో భాగంపై పడింది... కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డును కేజీఎఫ్ సొంతం చేసుకోగా.. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.. ఈ మూవీ బాలీవుడ్ స్టార్స్ మెరవబోతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ అధీరా పాత్రకు సంబంధించిన లుక్ విడుదల కాగా.. బాలీవుడ్ భామ రవీనాటాండన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. తాజాగా ఆమె ఈ మూవీ షూటింగ్‌లో చేరారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రవీనా టాండన్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. డెత్ వారెంట్ జారీ చేసిన లీడింగ్ లేడీ వచ్చేసింది అంటూ కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో వదిలారు.

ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు కేజీఎఫ్ ఫ్యాన్స్... ఈ మూవీలో రవీనా... రమికా సేన్‌గా నటిస్తున్నారు. మరోవైపు వీడియో లీక్‌ కేజీఎఫ్ బృందాన్ని కలవరపెడుతోంది.. గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో రెడ్ సూట్ ధరించి... యష్ నడుచుకుంటూ వెళ్తున్న ఓ వీడియో బయటకు రావడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమవుతోంది. ఇక, ఎలాంటి సీన్లు లీక్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com