శీతాకాలంలో కీళ్లనొప్పులు తగ్గాలంటే ఇలా చెయ్యండి...
- February 10, 2020
వణికించే చలి.. రగ్గు కప్పుకుని వెచ్చగా ముడుచుకుని పడుకుంటే పొద్దునకల్లా కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉంటాయి. అందరికీ అలానే ఉన్నా.. ఇంట్లో పెద్దవారు ఉంటే వారు మరింత ఇబ్బంది పడుతుంటారు బాధించే కీళ్ల నొప్పులతో.. ఓ పక్క చలి.. మరోపక్క కాళ్ల నొప్పులు. మందు బిళ్లలు ఎన్ని వేసుకున్నా మన ప్రయత్నంగా ఉపశమనం కోసం రోజూ ఇలా చేస్తుంటే.. కీళ్ల నొప్పులు కాస్త తగ్గే అవకాశం ఉంది.
సూర్య కిరణాలు పడే ప్రాంతంలో నిదానంగా నడవడం చేస్తుండాలి. చిన్న చిన్న వ్యాయామాలు.. శరీరం మొత్తాన్ని కదిలించేలాగా చేయాలి. నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పులు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. గోరు వెచ్చని నీటిని కాపడం పెడుతుండాలి.
వంటింట్లో వాడే పసుపు ఒంటికి చాలా మంచింది. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణం కీళ్లలో నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. పసుపులో గోరు వెచ్చని నీటిని కలిపి పేస్ట్‌లాగా తయారు చేసి మోకాళ్లపై పూయాలి. గంటా రెండు గంటలు ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
శరీరానికి తగినంత కాల్షియం, ఖనిజాలు ఇతర పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కీళ్ల ధృఢత్వానికి, ఇతర సమస్యల నుంచి బయటపడడానికి పాలు, పెరుగు, ఆకు కూరలు, నువ్వులు, అంజీర, సోయ, బాదం పాలు వంటి పోషకాహారాలను తీసుకోవాలి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!