అతి ఖరీదైన షిప్ కొనుగోలు చేసిన బిల్‌గేట్స్
- February 10, 2020
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్ ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. ఈ షిప్ పేరు ''ఆక్వా''అత్యంత విలాసవంతమైన యాట్ (విహార నౌక)ను బిల్‌గేట్స్ 2019లో కొన్నారు. మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఈ అద్భుతమైన షిప్ నమూనాను ఆయన ఎంతో ముచ్చటపడిపోయారు. పైగా అది పర్యావరణ హితమైనదని తెలిసి ఒక ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే కొనేశారు.
నమూనాగా ఉన్న ఆ షిప్ ను చూసిన బిల్ గేట్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుందని తెలియడంతో వెంటనే షిప్ తయారీకి కావాల్సిన డబ్బును బిల్‌గేట్స్ ఏమాత్రం ఆలోచించకుండూ ఇచ్చేశారు. వెంటనే షిప్ తయారు చేయమని చెప్పేశారు. కాగా..ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న బిల్ గేడ్స్ కు ఇప్పటి వరకూ సొంతగా విహార నౌక లేదు. తన కుటుంబంతో కలిసి షిప్ లో విహరించాలనుకుంటే ప్రైవేట్ యాట్‌లనే ఆయన ఇప్పటి వరకూ అద్దెకు తీసుకునేవారు. కానీ..పర్యవరణ హితమైన ఈ షిప్ గురించి తెలిసిన ఆయన పర్యావరణంపై ప్రేమతోనే ఈ షిప్ ను కొనుగోలు చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







