రెక్లెస్‌ డ్రైవింగ్‌: ఇద్దరు మోటరిస్టుల అరెస్ట్‌

- February 10, 2020 , by Maagulf
రెక్లెస్‌ డ్రైవింగ్‌: ఇద్దరు మోటరిస్టుల అరెస్ట్‌

అబుధాబి:రెక్లెస్‌ డ్రైవింగ్‌కి పాల్పడిన ఇద్దరు యువ మోటరిస్టులను అబుధాబి: పోలీస్‌ అరెస్ట్‌ చేయడం జరిగింది. ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలా వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీస్‌ అధికారులు, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఈ తరహా రెక్లెస్‌ డ్రైవింగే ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. రెక్లెస్‌ డ్రైవింగ్‌ పాల్పడేవారిపై కరిÄన చర్యలుంటాయనీ, స్మార్ట్‌ సిస్టమ్స్ ద్వారా నిందితుల్ని పట్టుకుంటామని అధికారులు హెచ్చరించారు. రోడ్లపై వాహనదారులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com