ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఫ్రెండ్ షిప్'
- February 10, 2020
ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు. తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పిన బజ్జీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ఒక సినిమాలో హీరోగా నటించేందుకు మొదటిసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. తమిళంలో 'ఫ్రెండ్ షిప్' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్&స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెండు చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉన్నఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.. ఈ చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెళ్లడించబోతున్నారు. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదలచేయనుంది చిత్ర యూనిట్.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..