రాహుల్‌ థక్కర్‌ ఆస్కార్‌ గెలుచుకున్నారు

- January 20, 2016 , by Maagulf
రాహుల్‌ థక్కర్‌  ఆస్కార్‌ గెలుచుకున్నారు

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు దక్కింది. టెక్నికల్‌ అచీవ్‌మెంట్‌ విభాగంలో రాహుల్‌ థక్కర్‌ అనే భారత సంతతి వ్యక్తి ఆస్కార్‌ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 13న జరిగే వార్షిక సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అవార్డుల ప్రదానోత్సవంలో రాహుల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. సాధారణంగా ఫిబ్రవరి 28న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. అయితే అంతకంటే ముందుగానే.. ఫిబ్రవరి 13న సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. ఈ విభాగంలో పది అవార్డులను అందజేస్తారు. ఆరోజే రాహుల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. అద్భుతమైన డిజైన్ల ద్వారా సినిమా రంగానికి విశేష సేవలందించినందుకుగానూ.. రాహుల్‌ను ఈ అవార్డు వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com