షార్జా:ఇక నుంచి ఆన్ లైన్ లో SEWA సర్టిఫికెట్స్ క్లియరెన్స్

- February 11, 2020 , by Maagulf
షార్జా:ఇక నుంచి ఆన్ లైన్ లో SEWA సర్టిఫికెట్స్ క్లియరెన్స్

షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ-SEWA అథారిటీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యం అందించేలా ఆన్ లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి ఒక్క టెక్స్ట్ మెసేజ్ లేదంటే వెబ్ సైట్ ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందవచ్చు. షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ సేవలను సులభతరం చేసేందుకు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా డిజిటలైజ్ చేశామని, దీని ద్వారా ప్రతి నెల 3 వేల మంది వినియోగదారులు బెనిఫిట్ పొందవచ్చని SEWA టాప్ అఫిషియల్స్ వెల్లడించారు. SEWA సేవలను డిజిటలైజ్ చేయాలనే ప్రణాళికను నిర్దేశించుకోవటంతో డాక్యుమెంట్లు అన్నింటిని డిజిటలైజ్ చేయటానికి ఐటీ డిపార్ట్మెంట్ అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. తద్వారా SEWAలో పేపర్ లెస్ ఎన్విర్వాన్మెంట్ సెటప్ ను చేరుకున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఎలక్ట్రానిక్ సర్వీస్ ద్వారా 1.5 మిలియన్ మంది ప్రజలకు సర్వీస్ అందించనున్నట్లు వివరించారు.

సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి బలమైన డిజిటల్ కార్యాలయం ఎంతో అవసరమని SEWA సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిజ్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి పేర్కొన్నారు. వినియోగదారుల భద్రతతో కూడిన బెస్ట్ సర్వీస్ అందించేందుకు తమ ఇంటర్నల్ టీం ఎప్పటికప్పుడు స్మార్ట్ సర్వీస్, అప్లికేషన్లను డెవలప్ చేసుకుంటుందని అన్నారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా ఇన్నోవేటీవ్ ఐడియాస్ ను స్వీకరిస్తామని, ఫ్యూచర్ లో సుస్థిరమైన సర్వీస్ అందించటంతో పాటు ఆన్ లైన్ సేవలను వినియోగదారులు ఈజీగా వాడుకునేలా చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com