ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ హవా

- February 11, 2020 , by Maagulf
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ హవా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్‌ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com