యూఏఈలో భారతీయుడికి కరోనా..!ఎనిమిదికి చేరిన కరోనా బాధితుల సంఖ్య

- February 11, 2020 , by Maagulf
యూఏఈలో భారతీయుడికి కరోనా..!ఎనిమిదికి చేరిన కరోనా బాధితుల సంఖ్య

దుబాయ్‌: చైనాని వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్‌ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్‌ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్‌ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్‌ నుంచి దుబాయ్‌కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com