దుబాయ్: భార్యను రక్షించబోయి మంటల్లో చిక్కకున్న ఇండియన్..90% కాలిన గాయాలు
- February 11, 2020
ప్రమాదవశాత్తు భార్య మంటల్లో చిక్కుకుపోయింది. ఆమెను రక్షించబోయిన భర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో అతనికి 90% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను అబుదాబిలోని మఫ్రక్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేరళ దంపతులు కొన్నేళ్లుగా ఉమ్ అల్ కువైన్ లో ఉంటున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. వారు ఉంటున్న అపార్ట్ మెంట్ కారిడార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బాక్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భార్యను అంటుకోవటంతో ఆమెను రక్షించేందుకు భర్త అనిల్ నినన్ ప్రయత్నించటంతో మంటలు అతనికి కూడా అంటుకున్నాయి. భార్య ప్రమాదం నుంచి బయటపడిందిగానీ అనిల్ శరీరం మాత్రం పూర్తిగా కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆ దంపతులను హుటాహుటిన షేక్ కలిఫా ఆస్పత్రికి తరలించారు. మహిళకు 10 శాతం కాలిన గాయాలయ్యాయయని..ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే..అనిల్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని అబుదాబిలోని మఫ్రక్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో అబ్జర్వేషన్ లో ఉన్నాడు. తాము చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నామని మిగతాది అంతా దేవుడి దయ అని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల