SATC ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు
- February 11, 2020
జోహెన్నెస్ బర్గ్:సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ (SATC) ఆధ్వర్యంలో జోహెన్నెస్ బర్గ్, సౌత్ ఆఫ్రికా లో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ.పీ.ఎన్.ఆర్.టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను జరుపుకోవటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కువగా నివసిస్తున్న దేశాల్లో సౌత్ ఆఫ్రికా ఒకటి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా, వారికి సేవలందించడం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏ.పీ.ఎన్.ఆర్.టీ.ఎస్ పనిచేస్తోందని తెలిపారు. ఏ.పీ.ఎన్.ఆర్.టీ సొసైటీ అందిస్తున్న వివిధ సేవలు.. ఐటి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోడానికి ప్రవాసాంధ్రులకు పలు కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇవ్వడం, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సేవ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం, దేవాలయాల దర్శనం వంటి ఎన్నో సేవల గురించి వివరించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా... అమ్మ ఒడి, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జగన్ అన్న గోరు ముద్ద పేరుతో పౌష్టికాహారం అందచేయటం, యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వడం లో భాగంగా నైపుణ్య విద్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారన్నారు. అంతేకాకుండా ప్రవాసాంధ్రులను అభివృద్ధి లో భాగస్వాములను చేస్తూ కనెక్ట్ టు ఆంధ్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. ఏపీ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని, ప్రభుత్వం వారికి తగిన సహాయం, అవకాశాలను అందిస్తోందని తెలిపారు. అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వకూడదు, అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న దృఢ సంకల్పంతో సౌత్ ఆఫ్రికా తరహాలో మూడు రాజధానుల నిర్ణయం చేయటం జరిగిందని, దీనికి తెలుగు వారందరూ ముందుకొచ్చి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ చైర్మన్ వెంకట్ మాగంటి, ప్రెసిడెంట్ విక్రమ్ పెట్లూరు, SATC గవర్నింగ్ బాడీ సభ్యులు మనోజా రాజవరపు, శ్రీకృష్ణా రెడ్డి, సుధీర్ బోనం మరియు సౌత్ ఆఫ్రికాలోని తెలుగు వారు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక