ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2020 విజేతల వివరాలు

- February 11, 2020 , by Maagulf
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2020 విజేతల వివరాలు

న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటరు విలక్షణ తీర్పు ఇచ్చాడు. 'ఆమ్ ఆద్మీ పార్టీ'కే వరుసగా మూడోసారి పట్టం కట్టారు. అదికూడా అఖండ మెజారిటీ రూపంలో అందజేశారు. కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకు దాదాపు దగ్గరగా 62 సీట్లలో గెలుపొందగా, బీజేపీ 8 సీట్లు గెలుపొందింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి సీట్ల పరంగా, ఓట్ల శాతం పరంగా ఒకింత మెరుగైన తీరు ప్రదర్శించినా, ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలన్న ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఖాతా తెరవలేదు. శతాధిక వత్సరాల జాతీయ పార్టీ ఈ తీరులో... 'పోయిందీ లేదు, వచ్చిందీ లేదు' అనే రీతిలో చతికిలపడటం గమనార్హం.

'ఆప్' చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో విజయం సాధించిన వారిలో ఆయన కేబినెట్ మంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు. మనీష్ సిసోడియా గట్టి పోటీని ఎదుర్కొని ఎట్టకేలకు విజేతగా నిలిచారు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ భారీ మెజారిటీతో ఓక్లా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. యువనేతలు అతిషి, రాఘవ్ చద్దాలు కల్కాజీ, రాజేందర్ నగర్ నుంచి గెలుపొందారు.

బీజేపీ 8 సీట్లు గెలుచుకుని, 38 శాతం ఓటు షేర్ పెంచుకుంది. ఆప్ ఓటు షేర్ 53.6గా ఉంది. కాంగ్రెస్ కేవలం 4.26 శాతం ఓట్ల ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
విజేతలు వీరే...

1.శరద్ కుమార్ (నరెల నియోజవర్గం - ఆప్)

2.సంజీవ్ ఝా (బురారి - ఆప్)

3.దిలీప్ పాండే (తైమార్‌పూర్ - ఆప్)

4.పవన్ శర్మ (ఆదర్శ్ నగర్ - ఆప్)

5.ఆశిష్ యాదవ్ (బడ్లి - ఆప్)

6. మొహిందర్ గోయల్ (రిథాలా - ఆప్)

7.జై భగవాన్ (బావన - ఆప్)

8.ధరంపాల్ లక్రా (ముండ్కా - ఆప్)

9.రితూరాజ్ దోవింద్ (కైరారి - ఆప్)

10. ముఖేష్ కుమార్ అహ్లావత్ (సుల్తాన్‌పూర్ మజ్రా - ఆప్)

11. రాఘువేంద్ర షోకీన్ (మంగోలి జాట్ - ఆప్)

12. రాఖి బిర్లా (మంగోల్ పురి - ఆప్)

13. విజేందర్ కుమార్ (రోహిణి - బీజేపీ)

14.బండన కుమారి (షాలిమార్ బాగ్ - ఆప్)

15. సత్యేంద్ర జైన్ (షకూర్ బస్తి - ఆప్)

16. ప్రీతి తోమర్ (ట్రి నగర్ - ఆప్)

17. రాజేష్ గుప్తా (వజిర్‌పూర్ - ఆప్)

18. అఖిలేష్ పతి త్రిపాఠి (మోడల్ టౌన్ - ఆప్)

19. సోమ్ దత్ (సదర్ బజార్ - ఆప్)

20. పర్లాద్ సింగ్ షాహ్‌నే (చాంద్నీ చౌక్ - ఆప్)

21. షోయిబ్ ఇక్బాల్ (మటియా మహల్ - ఆప్)

22. ఇమ్రాన్ హుస్సేన్ (బల్లిమారన్ - ఆప్)

23. విశేష్ రవి (కరోల్ బాగ్ - ఆప్)

24. రాజ్ కుమార్ ఆనంద్ (పటేల్ నగర్ - ఆప్)

25. మోతీనగర్ (శివ్ చరణ్ గోయెల్ - ఆప్)

26. గిరీష్ సోని (మాదిపూర్ - ఆప్)

27. ధన్వతి చండేలా (రాజౌరీ గార్డెన్ - ఆప్)

28. రాజ్ కుమార్ థిల్లాన్ (హరి నగర్ - ఆప్)

29. జర్నైల్ సింగ్ (తిలక్ నగర్ - ఆప్)

30. రాజేష్ రిషి (జనక్‌పురి- ఆప్)

31. మహీందర్ యాదవ్ (వికాస్‌పురి - ఆప్)

31. నరేష్ బల్యాన్ (ఉత్తమ్ నగర్ - ఆప్)

32. వినయ్ మిశ్రా (ద్వారక - ఆప్)

33. గులాబ్ సింగ్ (మాటియాలా -ఆప్)

34. కైలాష్ గెహ్లాట్ (నజఫ్ గఢ్ - ఆప్)

35. భూపేందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్ - ఆప్)

36. భావనా గౌర్ (పాలం-ఆప్)

37. వీరేందర్ సింగ్ కడియాన్ (ఢిల్లీ కంటోన్మెట్ - ఆప్)

38. రాఘవ్ చద్దా (రాజీందర్ నగర్ -ఆప్ )

39. అరవింద్ కేజ్రీవాల్ (న్యూఢిల్లీ - ఆప్)

40. ప్రవీణ్ కుమార్ (జాంగ్‌పుర - ఆప్)

41. మదన్ లాల్ (కస్తూర్బా నగర్ - ఆప్)

42. సోమ్‌నాథ్ భారతి (మాల్వీయ నగర్ - ఆప్)

43. ప్రమీళా టోకస్ (ఆర్కే పురం - ఆప్)

44. నరేష్ యాదవ్ (మెహ్రౌలి - ఆప్)

45. కర్తార్ సింగ్ తన్వార్ (ఛత్తర్‌పూర్ - ఆప్)

46. ప్రకాష్ జార్వాల్ (డియోలి - ఆప్)

47. అజయ్ దత్ (అంబేద్కర్ నగర్ - ఆప్)

48. దినేష్ మోహనియా (సంగం విహార్ - ఆప్)

49. సౌరభ్ భరద్వాజ్ (గ్రేటర్ కైలాష్ - ఆప్)

50. అతిషి (కల్కాజి - ఆప్)

51. సహిరామ్ (తుగలకాబాద్ - ఆప్)

52. రామ్‌వీర్ సింగ్ బిదూరి (బదర్‌పూర్ - బీజేపీ)

53.అమానుతుల్లా ఖాన్ (ఓక్లా-ఆప్)

54. రోహిత్ కుమార్ (త్రిలోక్‌పచురి - ఆప్)

55.కుల్‌దీప్ కుమరా్ (కోండ్లి - ఆప్)

56.మనీష్ సిసోడియా (పత్‌పర్‌గంజ్ - ఆప్)

57. అభయ్ వర్మ (లక్ష్మీనగర్ - బీజేపీ)

58. ఓం ప్రకాష్ శర్మ (విశ్వాస్ నగర్ - బీజేపీ)

59. ఎస్ కే బగ్గా (కృష్ణానగర్ - ఆప్)

60. అనిల్ కుమార్ బాజ్‌పాయి (గాంధీనగర్ -బీజేపీ)

61. రామ్ నివాస్ గోయెల్ (సహ్‌దారా-ఆప్)

62. రాజేంద్ర పాల్ గౌతం (సీమపురి-ఆప్)

63. జితేంద్ర మహాజన్ (రోహితాస్ నగర్ - బీజేపీ)

64. అబ్దుల్ రెహ్మాన్ (సీలంపూపర్ - ఆప్)

65. అజయ్ మహావర్ (ఘోండా - బీజేపీ)

66. గోపాల్ రాజ్ (బాబర్‌పూర్ - ఆప్)

67. సురేంద్ర కుమార్ (గోకల్‌పూర్ - ఆప్)

68. హజీ యూనుస్ (ముస్తఫాబాద్- ఆప్)

69. మోహన్ సింగ్ బిస్త్ (కరవాల్ నగర్ - బీజేపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com