కేరళ: వరద బాధితుల కోసం సిద్ధమైన 250 జోయ్ హోమ్స్..

- February 12, 2020 , by Maagulf
కేరళ: వరద బాధితుల కోసం సిద్ధమైన 250 జోయ్ హోమ్స్..

బహ్రెయిన్:కేర‌ళ వ‌ర‌ద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చింది జోయాలుక్కాస్ ఫౌండేష‌న్‌. వ‌ర‌ద‌ల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం జాయ్ హోమ్స్ పేరుతో 250 ఇళ్లను నిర్మించి బాధితులకు అప్పగించింది. 15 కోట్ల రూపాయ‌లతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కో ఇంటిని దాదాపు ఆరు ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించారు. నిర్వాసితులకు కోసం జోయ్ హోమ్స్ పేరుతో జోయాలుక్కాస్ ఫౌండేష‌న్‌ అందించిన సాయం అతి గొప్పదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. జోయ్ హోమ్స్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం..ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఆగస్ట్ లో సంభవించిన వరదల్లో వందలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. కేరళ పున: నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్న తమ పిలుపుతో వరద బాధితులకు జోయాలుక్కాస్ అందించిన సేవలు మరువలేమని సీఎం పినరయి విజయన్ అన్నారు. అంతేకాదు..నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జోయాలుక్కాస్ ఫౌండేషన్ నిర్వాసితుల కోసం 250 ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతానికి 160 కుటుంబాలు జోయ్ హోమ్స్ కు షిప్ట్ అవగా..మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అప్పగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com