మోదీ ని కలిసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- February 12, 2020
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా సీఎం జగన్ ....ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు.
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ , మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!