మహిళను హతమార్చిన వలసదారుడు
- February 12, 2020
ఫుజేరా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, 25 ఏళ్ళ ఆసియా వ్యక్తిని మర్డర్ కేసులో దోషిగా తేల్చింది. కోర్టు ఫైల్స్ వివరాల ప్రకారం నిందితుడు, ఓ ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఫసీల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద కత్తితో ఓ మహళపై దాడి చేశాడు నిందితుడు. దాంతో, ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా, 11 ఏళ్ళ బాలుడినీ, 11 ఏళ్ళ బాలికనీ నిందితుడు తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఇద్దరూ బాధితురాలి పిల్లలు. కాగా, ఆ ఇంట్లో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేస్తున్న మరో మహిళపై కూడా నిందితుడు దాడి చేశాడు. అనంతరం నిందితుడు, బాధితురాలి కారుపై పారిపోయాడు. కాగా, ఫుజేరా పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోపక్క, నిందితుడి మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!