యూఏఈ:రానున్న వారం రోజుల్లో 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనున్న టెంపరేచర్
- February 13, 2020
యూఏఈ:ఇన్నాళ్లు కుండపోత వర్షాలు, చలిగాలులను ఫేస్ చేసిన యూఏఈ..ఇక హీట్ వెదర్ ను ఫేస్ సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. రానున్న వారం రోజుల్లో దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ పెరగనుంది. యూఏఈలో మిడ్ జనవరి అనూహ్యంగా వర్షపాతం నమోదైంది. దానికి అనుగుణంగా చలి తీవ్రత కూడా పెరిగింది. దాదాపు 8-10 డిగ్రీల సెల్సియస్ వరకు లో టెంపరేచర్స్ నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ట్వంటీస్ కి అటు ఇటుగా రికార్డ్ అయ్యింది. ఇక నుంచి మాత్రం సన్నియర్ వెదర్ కనిపించబోతోంది. వచ్చే ఆదివారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే సోమవారం 28 డిగ్రీల సెల్సియస్, బుధవారం 29 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే..హ్యూమిడిటీ లెవల్స్ మాత్రం తక్కువగా ఉండే అవకాశాలు ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!