సహచరుడిపై నలుగురు దుబాయ్ కార్మికుల దాడి
- February 13, 2020
దుబాయ్:తమ సహచరుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినందుకుగాను నలుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో ఈ కేసు విచారణ జరుగుతోంంది. 2019 అక్టోబర్ 17న ఈ ఘటన జరిగింది. నలుగురు పాకిస్తానీ వ్యక్తులు తమ కొలీగ్ అయిన ఇండియన్ వర్కర్‌పై దాడి చేశారు. బస్ కోసం తాను వేచి చూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. దాడిలో తాను తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాననీ, ఓ వ్యక్తి తనపై నీళ్ళు చల్లడంతో మెలకువ వచ్చిందని ఆనాటి సంఘటనని వివరించారు బాధితుడు. దాడి తీవ్రత కారణంగా పలు చోట్ల బాధితుడికి ఎముకలు విరిగిపోయాయి. పర్మనెంట్ డిజేబులిటీ సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులపై ఈ నెల 26న న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







