నాగ శౌర్య ,రీతువర్మ ల నూతన చిత్రం ప్రారంభం
- February 13, 2020
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తమైంది. 'లక్ష్మీ సౌజన్య' ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక 'రీతువర్మ' జంటగా రూపొందిస్తున్న చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్ లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.
ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్h
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







