సహచరుడిపై నలుగురు దుబాయ్‌ కార్మికుల దాడి

- February 13, 2020 , by Maagulf
సహచరుడిపై నలుగురు దుబాయ్‌ కార్మికుల దాడి

దుబాయ్‌:తమ సహచరుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినందుకుగాను నలుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. దుబాయ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌లో ఈ కేసు విచారణ జరుగుతోంంది. 2019 అక్టోబర్‌ 17న ఈ ఘటన జరిగింది. నలుగురు పాకిస్తానీ వ్యక్తులు తమ కొలీగ్‌ అయిన ఇండియన్‌ వర్కర్‌పై దాడి చేశారు. బస్‌ కోసం తాను వేచి చూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. దాడిలో తాను తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాననీ, ఓ వ్యక్తి తనపై నీళ్ళు చల్లడంతో మెలకువ వచ్చిందని ఆనాటి సంఘటనని వివరించారు బాధితుడు. దాడి తీవ్రత కారణంగా పలు చోట్ల బాధితుడికి ఎముకలు విరిగిపోయాయి. పర్మనెంట్‌ డిజేబులిటీ సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులపై ఈ నెల 26న న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com