విన్నర్స్ ట్రిప్ టీజర్ విడుదల
- February 13, 2020
శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్ఎస్ సి క్రియేషన్స్ పతాకంపై శ్రీనుతెలుగు దర్శకత్వంలో సంపత్ శ్రీను, కె. లక్ష్మణరావు నిర్మిస్తున్నచిత్రం `విన్నర్స్ ట్రిప్`. మహి, సోనా పాటిల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రం టీజర్ ని పిబ్రవరి12న ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ - "ఒక చిన్న సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడమే ఒక విజయం. ఈ టీమ్ సంతోషం చూస్తుంటే కచ్చితంగా గెలవాలనే తపనతోనే ఈ సినిమా తీశారనిపిస్తోంది. తప్పకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతున్నాను. దర్శక నిర్మాతలకి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్" అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - "తెలుగు సినిమా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న ఈ తరుణంలో టైటిల్ లోనే విన్నర్ అని ఉండడం శుభసూచికం. చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అలాగే `ధర్మ యుద్ధం` సినిమాలో ఒక ఉద్యోగిగా చేసి ఆ తర్వాత బాబు మోహన్ లేని సినిమా ఉండదు అనే స్థాయికి వెళ్లారు ఆయన చేతుల మీదుగా పోస్టర్ విడుదలవడం చాలా హ్యాపీ" అన్నారు.
ప్రొడ్యూసర్ సంపత్ శ్రీను మాట్లాడుతూ - ``ఈ మూవీ షూటింగ్ 30రోజులు టాకీ, 10రోజులు సాంగ్స్ అంతా గోవాలోనే పూర్తి చేశాం. హీరో హీరోయిన్ సహా ప్రతి ఒక్కరు చాలా కోపరేటివ్ గా పనిచేశారు. అలాగే డైరెక్టర్ తెలుగు శ్రీను అందరితో కలిసిపోయి చక్కగా తెరకెక్కించాడు. అలాగే ఎడిటర్ ఈశ్వర్ పూర్తి సహకారం అందించి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా రేంజ్ లో రావడానికి ఎంతో దోహదపడ్డారు" అన్నారు.
దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ - "ముందుగా ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ చిత్రీకరణ పూర్తి అయినతర్వాత మా ప్రొడ్యూసర్ గారి సలహా మేరకు `విన్నర్ ట్రిప్` అయితే యాప్ట్ అనిపించి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ఒక ఎఫ్ ఎమ్ రేడియో కాంటెస్ట్ లో గెలిచిన విజేతలందరిని ఒక ట్రిప్ కి తీసుకెళ్తే అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అందులోనుండి ఎంతమంది బయటపడ్డారు అనేది కథాంశం" అన్నారు.
హీరో మహి మాట్లాడుతూ - "మా నిర్మాత సంపత్ గారు, లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ నుండి మాతో ట్రావెల్ అవుతూ మాకు ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. త్వరలో మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి" అన్నారు.
హీరోయిన్ సోనా పాటిల్ మాట్లాడుతూ - "ఒక కొత్తతరహా చిత్రం ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకి, మా టీమ్ అందరికి ధన్యవాదాలు" అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి దన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!