చావు కబురు చల్లాగా షూటింగ్ ప్రారంభం
- February 13, 2020
గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సమర్పణలో పిల్లా , భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జిఏ2 బ్యానర్ పై మరో సన్సేషనల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు యంగ్ ఇంటిలిజెంట్ ప్రోడ్యూసర్ బన్నివాసు. ఆర్.ఎక్స్ 100 సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా , లక్కిబ్యూటి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుకబురు చల్లగా.. ఈరోజు ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ గారి మనమరాలు బేబి అన్విత క్లాప్ నివ్వగా , స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి మెదటి దర్శకత్వ భాద్యతని అల్లు అరవింద్ గారు నిర్వహించారు. ఈ చిత్రం లో హీరో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్రముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి తన సినిమాటొగ్రఫి ని అందిస్తున్నారు, ఎడిటర్ గా సత్య, ప్రోడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా రాఘవ కరుటూరి లు బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుండి ఈ చిత్రం షూటింగ్ జరుకుంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు..
ఈ చిత్రంలో నటీనటులు.. కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటిస్తున్నారు..
బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం.. జేక్స్ బిజోయ్
కెమెరా.. సునీల్ రెడ్డి,
ప్రోడక్షన్ డిజైనర్.. మనీషా ఏ దత్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. రాఘవ కరుటూరి
ఎడిటర్.. సత్య
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత : బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!