ఆమాద్మీ పార్టీ సంచలన నిర్ణయం..ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళెవ్వరు రారట

- February 13, 2020 , by Maagulf
ఆమాద్మీ పార్టీ సంచలన నిర్ణయం..ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళెవ్వరు రారట

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ మరోసారి తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని కేవలం ఢిల్లీ ప్రజల మధ్యే ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానం పంపడం లేదు. ఈ మేరకు ఆమాద్మీ పార్టీ ఢిల్లీ విభాగం కన్వీనర్ గోపాల్ రాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ''ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులెవరికీ ఆహ్వానం పంపడం లేదు. కేవలం ఢిల్లీ ప్రజల సమక్షంలో మాత్రమే ఈ కార్యక్రమం జరగనుంది...'' అని ఆయన తెలిపారు.

తన నాయకత్వంపై నమ్మకం ఉంచి మళ్లీ అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలతో కలిసి కేజ్రీవాల్ ప్రమాణం చేయనున్నట్టు రాయ్ పేర్కొన్నారు. ఈ నెల 16 ఆదివారం ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్ లీలా మైదానం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆమాద్మీ పార్టీ 62 స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా ఎనిమిది స్థానాలు బీజేపీకి దక్కగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్కచోట కూడా విజయం దక్కలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com