సుష్మా స్వరాజ్ కు ఘన నివాళి
- February 13, 2020
సుష్మా స్వరాజ్...పరిచయం అవసరం లేని ఒక మహా మనిషి..ఆమె పేరు విన్నవెంటనే ఎందరినో ఆదుకున్న మమకారపు హృదయం గుర్తుకొస్తుంది. ఫిబ్రవరి 14 సుష్మ స్వరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పరకటం చేసింది భారత ప్రభుత్వం..వివరాలు ఇలా..
మాజీ విదేశాంగ మంత్రి దివంగత శ్రీమతి సుష్మా స్వరాజ్ యొక్క భారత దౌత్య, ప్రజా సేవ మరియు అమూల్యమైన కృషికి గుర్తుగా న్యూ ఢిల్లీ లోని 'ప్రవాసీ భారతీయ కేంద్రం' ను 'సుష్మా స్వరాజ్ భవన్' గా మరియు 'ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్' ను 'సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్' గా మారుస్తూ ఆమెకు ఘన నివాళి అందించింది భారత ప్రభుత్వం.
ప్రధాని మోదీ తొలి కేబినెట్లో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రెండో మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. 1998లో కొద్ది రోజులపాటు ఢిల్లీ సీఎంగానూ ఆమె పని చేశారు. మోదీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా ఆమె విశేష సేవలు అందించారు. ఆ పదవికి ఆమె వన్నె తీసుకొచ్చారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో, పాకిస్థానీయులకు మెడికల్ వీసాలు అందజేయడంలో ఆమె చొరవ చూపారు. నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటూ.. సామాన్యుడి మంత్రిగా అనిపించుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆమె వ్యవహరించారు.
తెలంగాణతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్లో తెలంగా గొంతుకను బలంగా వినిపించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆమెను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. 2017 చివర్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడిన ఆమె.. ‘‘నేను మీ తెలంగాణ చిన్నమ్మను’’ అనగానే.. సభ చప్పట్లతో మార్మోగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







