కరోనా వైరస్ ఎఫెక్ట్: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, పెరిగిన బంగారం ధర
- February 13, 2020
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ రోజు ప్రారంభం నుండే నష్టాల్లోకి జారుకున్నాయి. క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 106.11 (0.26%) పాయింట్ల నష్టంతో 41,459.79 వద్ద, నిప్టీ 26.55 (0.22%) పాయింట్ల నష్టంతో 12,174.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.33 వద్ద ట్రేడ్ అయింది.
చైనాలో కరోనా వైరస్ ప్రభావం మార్కెట్లపై ప్రభావం చూపిస్తోందని భావిస్తున్నారు. దీంతో పాటు జనవరిలో రిటైల్ ద్రవ్యోల్భణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకోవడం, డిసెంబర్ 2019లో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసి ఉంటాయని భావిస్తున్నారు.
టైటాన్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలీవర్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్ట్లే, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, అల్ట్రా సిమెంట్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
బజాజ్ ఆటో ఫిన్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, హీరో మోటో కార్ప్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకులు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మరోవైపు, నేడు (ఫిబ్రవరి 13) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రభావం మార్కెట్లపై పడి నష్టపోవడంతో పాటు బంగారంపై ఒత్తిడి పెరిగింది.
ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గ్రాముల బంగారం ఏప్రిల్ బంగారం కాంట్రాక్ట్స్ రూ.119 (0.30%) పెరిగి రూ.40,603గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,562 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్స్ 17.55 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!