దుబాయ్: ఇకై ఒక్క రోజులోనే చారిటబుల్ ట్రస్ట్ లైసెన్స్..కొత్త రెగ్యూలరేషన్ జారీ

- February 13, 2020 , by Maagulf
దుబాయ్: ఇకై ఒక్క రోజులోనే చారిటబుల్ ట్రస్ట్ లైసెన్స్..కొత్త రెగ్యూలరేషన్ జారీ

దుబాయ్ లో చారిటబుల్ ట్రస్ట్ లైసెన్స్ జారీలో కొత్త నిబంధనలను దుబాయ్ ప్రభుత్వం రూపొందించింది. ఇన్నాళ్లు చారిటబుల్ ట్రస్ట్ కు లైసెన్స్ జారీకి 15 రోజులు సమయం పట్టేది. అయితే..ఇక నుంచి ఒక రోజులోనే లైసెన్స్ ఇవ్వనున్నట్లు ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్-IACAD ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అహ్మద్ అల్ ముహైరి వెల్లడించారు. చారిటబుల్ యాక్టివిటీస్ రెగ్యూలేట్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో స్నేహపూర్వక సెటిల్మెంట్ కు అవకాశం కల్పించేలా తీర్మానాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మూడు తీర్మానాలు చేయగా అందులో ఒకటి చారిటబుల్ ట్రస్ట్ లకు లైసెన్స్ జారీ చేయటం. మిగిలిన రెండు తీర్మానాలు ఖురాన్ కాపీల ప్రచురణలు, రిలిజియస్ పబ్లికేషన్స్ కు సంబంధించినవి.

2019లో లైసెన్స్ కలిగిన ట్రస్ట్ లు చారిటబుల్ బాక్స్ ల నిర్వహణలో 26 రూల్స్ వయోలేషన్స్ కు పాల్పడినట్లు గుర్తించామని IACAD ప్రకటించింది. అలాగే లైసెన్స్ లేని సంస్థలు 41 వయోలేషన్స్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఎమరాతి పరిధిలో మొత్తం 5,525 డొనేషన్ బాక్సులు ఉండగా అందులో 2,300 క్లాత్ కలెక్షన్ బాక్సెస్ ఉన్నాయని IACAD తెలిపింది. కొత్తగా నిర్దేశించిన తీర్మానాల ప్రకారం ఇకపై ఖురాన్ తో పాటు ఇతర మత ప్రచురణలు, సర్క్యూలేషన్ లపై నిబంధనలను  IACAD  కఠినతరం చేసింది. మతపరమైన ప్రచురణలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని వెల్లడించింది. ఖురాన్ ప్రచురణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించింది. మొత్తం 9 లాంగ్వేజెస్ లో ఖురాన్ అనువాదానికి అనుమతులు ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com