164 పేద రోగుల కోసం 220,000 దిర్హాముల విరాళమిచ్చిన ఎమిరాతి
- February 13, 2020
రాస్ అల్ ఖైమా:ఎమిరాతి బిజినెస్ మేన్ ఖాలిద్ అబ్దుల్లా యూసుఫ్ 220,000 దిర్హాములను 164 మంది పేద రోగుల వైద్య చికిత్స కోసం విరాళంగా అందించారు. షేక్ ఖలీఫా స్పెషాలిటీ ఆసుపత్రిలో బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. వీరెవరూ వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేరు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకున్న యూసుఫ్, వారందరి వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించేందుకు ముందుకొచ్చారు. యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు యూసుఫ్. కాగా, సాయం అందుకోనున్న రోగులు, తమకు సాయం ప్రకటించిన యూసుఫ్కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, షేక్ ఖలీఫా స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్, తమకు 220,000 దిర్హాముల చెక్ అందిందని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!