భారీ హ్యామన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ పట్టివేత
- February 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భారీ హ్యామన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌ని పట్టుకోగలిగింది. ఈ ట్రాఫికింగ్‌తో సంబంధం వున్న ముగ్గురు బంగ్లాదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ మనీ లాండరింగ్‌కి పాల్పడిందనీ, ఆ మొత్తం 50 మిలియన్ దినార్స్‌కి పైగా వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 20,000 మంది బంగ్లాదేశీ లేబరర్స్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లపై తీసుకొచ్చారనీ, ఈ క్రమంలో నిందితులు 50 మిలియన్ కువైటీ దినార్స్ (భారత కరెన్సీలో 1100 కోట్ల రూపాయలు) మార్పిడి చేశారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో వర్కర్ కోసం 1,800 నుంచి 2,200 దినార్స్ వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా, డ్రైవర్ వీసాలను 2,500 నుంచి 3,000 దినార్స్‌కి విక్రయించారు. కువైట్‌కి మొత్తంగా 20,000 మందికి పైగా బంగ్లాదేశీలను నిందితులు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







