యూఏఈ: ఫ్రెండ్ ని మర్డర్ చేసిన ప్రవాసీయుడు..18 గంటల్లో అరెస్ట్

- February 14, 2020 , by Maagulf
యూఏఈ: ఫ్రెండ్ ని మర్డర్ చేసిన ప్రవాసీయుడు..18 గంటల్లో అరెస్ట్

వాళ్లంతా స్నేహితులు. అజ్మన్ లోని ఓ రెస్టారెంట్ లో కలుసుకున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నా..అందులో ఒకతను అకస్మాతుగా తోటి స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఇష్టానుసారంగా పొడిచేశాడు. దీంతో బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. ఆ వెంటనే మిగిలిన స్నేహితులతో కలిసి ట్యాక్సీలో పారిపోయాడు. కానీ, అజ్మన్ పోలీసులు దుబాయ్ పోలీసుల సహకారంతో హంతకుడ్ని వేటాడి వెంటాడి 18 గంటల్లో పట్టుకున్నారు. అజ్మన్ లోని ముస్సాలా గ్రౌండ్ సమీపంలోని అల్-లివారా 1 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసియాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి మరో ముగ్గురు స్నేహితులు మృతుడు రెస్టారెంట్ లో కలుసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత హంతకుడు దారుణంగా తన ఫ్రెండ్ పై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు.

మర్డర్ జరిగినట్లు ఆదివారం రాత్రి 10.30 గంటలకు సమాచారం అందిందని అజ్మన్ సీఐడీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నుయిమి తెలిపారు. ఫోన్ కాల్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ టీంతో పాటు ఆంబులెన్స్ ను పంపించామని వివరించారు. ఘటనపై అక్కడి వారిని ప్రశ్నించటంతో అసియాకు చెందిన వ్యక్తి హత్య చేశాడని, అప్పుడు అతనితో మరో ముగ్గురు ఉన్నారని, మర్డర్ తర్వాత వాళ్లంతా ట్యాక్సీలో పారిపోయారని నిర్ధారించుకున్నట్లు సీఐడీ డైరెక్టర్ వెల్లడించారు. వెంటనే అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దుబాయ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు చిక్కకుండా దేశం విడిచి పారిపోయేందుకు దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా హంతకుడ్ని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన 18 గంటల్లో నిందితుడ్ని అరెస్ట్ చేశామని, అలాగే అతనితో ఉన్న ముగ్గురు స్నేహితులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అహ్మద్ సయీద్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com