అబుధాబి:BAPS హిందు మందిర్ కోసం రికార్డు స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్
- February 14, 2020_1581664219.jpg)
అబుధాబి - BAPS హిందూ మందిర్ కోసం అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. రాఫ్ట్ ఫౌండేషన్ కోసం రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ని నింపే కార్యక్రమం ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యింది. పూజ్య బ్రహ్మవిహారి స్వామి మరియు పూజ్య అక్షయ్ మునిదాస్ స్వామి ప్రత్యేక పూజలు నిర్మాణ స్థలి వద్ద చేపట్టారు. యూఏఈలో భారత రాయబారి అయిన పవన్ కపూర్, దుబాయ్‌లో ఇండియా కాన్సుల్ జనరల్ విపుల్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఒమన్ అల్ ముథానా, షాపూర్జీ పల్లోంజీ సీఈఓ మోహన్‌దాస్ సైని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాచీన సాంకేతికతకు మోడ్రన్ టెక్నాలజీని జోడించి ఈ మందిర్ నిర్మాణం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘ఈ దేశాన్ని కేవలం నివసించడానికి మాత్రమే కాదు, దీన్ని తమ సొంత దేశంగా భావిస్తున్నాం..’ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు భారతీయ వలసదారులు అభిప్రాయపడ్డారు. 55 శాతం ఫ్లై యాష్‌తో, 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిక్స్‌ని ఒకే దఫాలో రాఫ్ట్ ఫౌండేషన్ కోసం వినియోగించారు. 300 హైటెక్ సెన్సార్స్, 10 డిఫరెంట్ లెవల్స్‌లో డేటాను విశ్లేషించి తదనుగుణంగా నిర్మాణం చేపడుతున్నారు. ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ కిషిదా తదాహిరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022 నాటికి ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు