తెలంగాణ రానున్న 16 మంది గల్ఫ్ బాధితులు
- February 14, 2020హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్ లో చిక్కుకున్న వారికి విమాన టికెట్లు అందించి తెలంగాణకు రప్పిస్తుంది. ఈ రోజు ఇరాక్ నుంచి బయలుదేరిన వీరంతా రేపు ఉదయం హైదరాబాద్ కి చేరుకుంటారు. వీరందరిని వారి వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన స్థానిక రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ సమకూర్చినది. ఆపత్కాలంలో తమ బాధలకు స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టి బాబు ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!