జెడ్డాఃఫ్లైట్ క్రాష్ ల్యాండ్..రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ తో పైలట్ సేఫ్
- February 15, 2020
సౌదీ అరేబియా కొండ ప్రాంతంలోని ఓ రిమోట్ ఏరియాలో విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే..రెస్క్యూ టీమ్స్ సకాలంలో స్పందించిన తనను రక్షించారని పైలట్ ప్రశంసలు కురిపించాడు. ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల దూరం కనిపించిన పైలట్ తహ అల్ కబ్బషిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించి ఆస్పత్రికి తరలించింది. హెల్త్ చెకప్ తర్వాత 68 ఏళ్ల ఆ పైలట్ రెస్క్యూ బృందానికి థ్యాంక్స్ చెప్పాడు. ఇదే ప్రమాదం ఇంకెక్కడైనా జరిగి ఉంటే తాను ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడినని..తనను రక్షించిన రెస్క్యూ టీంకు రుణపడి ఉంటానని అన్నాడాయన.
మినిస్ట్రి ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ లో ఓ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన విమానంలో అల్ కబ్బషి పైలట్. సింగిల్ ఇంజిన్ ఉన్న త్రష్ S2R-34 విమానంలో తనకు నిర్దేశించిన లక్ష్యం కోసం ఎప్పటిలాగే బయల్దేరాడు. అల్ ఖున్ఫద్ గవర్నరేట్ లోని మినిస్ట్రి రన్ వే నుంచి అతని ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. 500 మీటర్ల ఎత్తులో ఉండగా ఫ్లైట్ ఇంజిన్ పెయిల్ అవటంతో పర్వత ప్రాంతంలోని చెట్లపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 16 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత...ప్రమాదం జరిగిన స్పాట్ కి 3 కిలోమీటర్ల దూరంలో పైలట్ ను ప్రాణాలతో గుర్తించారు. వెంటనే అతన్ని అల్ మజర్ద జనరల్ ఆస్పత్రికి తరలించి హెల్త్ చెకప్ చేయించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!