షార్జా:పనిమనిషిని చంపేస్తానని బెదిరింపులు..
- February 15, 2020
షార్జా:షార్జాలో కన్నకొడుకునే పోలీసులకు పట్టించాడు ఓ తండ్రి. ఇంట్లో పని చేసే మహిళను చంపేస్తానని బెదిరించటంతో ఆ తండ్రి పోలీసులకు ఫోన్ చేసి కొడుకు నిర్వాకంపై కంప్లైంట్ చేశాడు. దీంతో షార్జా పాట్రోలింగ్ పోలీసులు 38 ఏళ్ల జీసీసీ నేషనల్ వ్యక్తని అదుపులోకి తీసుకుంది. అతనిపై బెదిరింపు అభియోగంతో పాటు పోలీస్ పాట్రోలింగ్ కార్ ను డ్యామేజ్ చేసినందుకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసును కూడా నమోదు చేశారు.
పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్న నిందతుడు..తన నాలుగేళ్ల కూతర్ని కొట్టినందుకే తనకు కోపం వచ్చిందన్నాడు. కూతుర్ని కొట్టిన పనిమనిషిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో వణికిపోయిన ఆమె..నిందితుడి తండ్రికి విషయం చెప్పింది. వెంటనే అతను కొడుకుపై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించటంతో..పోలీసులు పాట్రోలింగ్ టీంను పంపించారు. అయితే..పాట్రోలింగ్ టీం చేరుకునే సమయానికే తాను తన తండ్రి ఇంట్లో పనిమనిషి కోసం కత్తితో పాటు ఎదురుచూస్తున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తండ్రి కారుతో పాటు పోలీస్ పాట్రోలింగ్ వాహనం కూడా వస్తుండటం గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో పోలీస్ కారును ఢికొట్టడంతో కార్ డ్యామేజ్ అయ్యింది. చివరికి ఎలాగోలా నిందితుడ్ని అరెస్ట్ చేసి..అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







