కర్ణాటక:ఉసేన్ బోల్డ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇండియన్ లోకల్ టాలెంట్
- February 15, 2020
కర్ణాటక:ఒలంపిక్ కాంపిటీషన్స్ కు ప్రీపేర్ కావాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. వరల్డ్ క్లాస్ ఈవెంట్లలో అదరగొట్టేందుకు ఎన్నో ఎళ్లు కష్టపడాల్సి ఉంటుంది. జమైకన్ స్పింటర్స్ అయితే...ట్రాక్ పై స్పీడు పెంచుకునేందుకు కొండలు గుట్టల్లో పరుగెడుతూ ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతా చేసినా ట్రాక్ మీదకు వచ్చే సరికి స్టార్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ ముందు తేలిపోతారు. అతని వేగాన్ని అందుకోలేక చతికిలబడిపోతారు. అలాంటి జమైకన్ చితా రికార్డును మన ఇండియన్ లోకల్ టాలెంట్ ఫెలో బ్రేక్ చేశాడు. అతని పేరు శ్రీనివాస గౌడ. ఊరు కర్ణాకటలోని మంగళూరు సమీపంలోని మూడబిద్రి శివారు గ్రామం. అతని మెరుపు వేగం నివ్వెరపోయేలా చేస్తోంది. ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ ఉసేన్ బోల్ట్ ను తలపిస్తోంది.
కర్ణాటకలో సాంప్రదాయ క్రీడ కంబళ పోటీలో అతను తన దున్నతలతో కలిసి 142.50 మీటర్ల వేగాన్ని కేవలం 13.62 సెకన్లలో ఫినిష్ చేశాడు. అంటే 100 మీటర్లను 9.55 సెకన్స్ లో కంప్లీట్ చేసినట్లు లెక్క. 2009 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో బోల్ట్ 9.58 సెకన్లలో 100 మీటర్ల ట్రాక్ ను ఫినిష్ చేశాడు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమ ప్రదర్శన. కానీ, ఇప్పుడు ఇండియన్ లోకల్ టాలెంట్ శ్రీనివాస గౌడ..బోల్ట్ కంటే 3 సెకన్లు ముందుగానే 100 మీటర్లు పరిగెత్తాడు. అదీ బురద మళ్లలో. ఇక క్లీన్ సర్ఫేస్ ఉండే ట్రాక్ మీద అతని పరుగు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంతేకాదు..కంబళ పోటీలోనూ గత 30 శ్రీనివాస గౌడదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం.
శ్రీనివాస గౌడ పరుగుతో జనం అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీనివాస గౌడ స్టార్ గా మారిపోయాడు. ఒక్క ఇండియాలోనే కాదు..వరల్డ్ వైడ్ ఇప్పుడు అతని గురించే చర్చ జరుగుతోంది. శ్రీనివాస గౌడకు సరైన తీరులో ట్రైనింగ్ ఇప్పించి ఒలంపిక్స్ కు ప్రీపేర్ చేయాలంటూ చాలామంది నెటిజన్లు తమ వ్యూస్ షేర్ చేసుకుంటున్నారు. అయితే..సడెన్ గా పాపులర్ అయిన శ్రీనివాస గౌడ..తనకు రికార్డులు తెలియవని..తన 18వ ఏట నుంచే కంబళలో పాల్టొంటున్నానని చెబుతున్నాడు. తన దున్నపోతుల వేగం కూడా తన పరుగుకు కారణమంటున్నాడు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







