శంషాబాద్ చేరుకున్న ఇరాక్ బాధితులు
- February 15, 2020
శంషాబాద్: ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ వాసులను రాష్ట్ర ప్రభుత్వం నగరానికి తీసుకువచ్చింది. నకిలీ ఏజెంట్ల మోసంతో మూడేళ్లుగా ఇరాక్‌లో చిక్కుకున్న బాధితులు.. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, సొంత ప్రాంతాలకు తిరిగి రాలేకపోతున్నామని వీడియోల ద్వారా బాధితులు తమ ఆవేదనను వెల్లడించారు. వారి ఆవేదనను విన్న మంత్రి కేటీర్.. బాధితులను రాష్ర్టానికి తీసుకువచ్చేందుకు తక్షణమే చర్యలు తీసులకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు.. ఇరాక్ అధికారులతో సంప్రదింపులు జరిపి బాధితులను రాష్ర్టానికి రప్పించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు 16 మంది బాధితులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారందరికీ కోటపాటి నర్సింహం నాయుడు స్వాగతం పలికారు సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది.ఈ సందర్భంగా బాధితులు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!