హఫీజ్ విడుదల కు పాక్ స్కెచ్!

- February 15, 2020 , by Maagulf
హఫీజ్ విడుదల కు పాక్ స్కెచ్!

న్యూఢిల్లీ: హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష పడిందన్న వార్తే ఓ సంచలనం. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చే పాక్ తాను స్వయంగా పెంచి పోషించి ఉగ్రవాదిని జైలు పాలు చేస్తుందా అనే సందేహం అప్పట్లో తెరపైకి వచ్చింది. ఇక ఫైనాన్షీయల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్) వారి ఒత్తిడి పనిచేయడంతోనే పాక్ దీనికి పూనుకుందన్న విషయం బహిరంగ రహ్యస్యమే. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ ఎఫ్‌ఏటీఎఫ్ అధికారులు తేల్చిచెప్పడంతో హఫీజ్ జైలు పాలు కావాల్సి వచ్చింది. అతడికి కేవలం 5 సంవత్సరాల పాటే జైలు శిక్ష పడినప్పటికీ..ఇప్పటికైనా హఫీజ్ ఊచలు లెక్కపెడుతున్నందుకు శాంతిని కాంక్షించే వారందరూ సంతోషించారు.

అయితే హఫీజ్ అరెస్టు విషయంలో తాజా వార్త కలకలం రేపుతోంది. బ్లాక్‌లిస్ట్‌లో పాక్‌ను పెట్టబోమంటూ ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయం తీసుకున్న అనంతరం సమయం చూసి హఫీజ్ విడుదల చేసేందుకు పాక్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న లొసుగల ఆధారంగా అతడు విడుదల కాబోతున్నాడని తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌ జైలు శిక్షపై పైకోర్టులో అప్పీలు చేస్తామని ఇప్పటికే అతడి లాయర్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తడి తప్ప హఫీజ్‌ను అరెస్టు మరే కారణమూ లేదని అతడు వాదించబోతున్నట్టు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com