బహ్రెయిన్:లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ఎంప్లాయ్ కి జైలు శిక్ష
- February 15, 2020
బహ్రెయిన్:ప్రజలకు సర్వీస్ అందించాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయ్ డబ్బు కక్కుర్తి అతన్ని జైలు పాలు చేసింది. ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో హై క్రిమినల్
కోర్టు ఆ ఎంప్లాయ్ కి జైలు శిక్ష విధించింది. కోర్టు రికార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ తో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు లైట్స్ ను ఏర్పాటు చేసింది. అయితే..ఒప్పందంలో పేర్కొన్న విధంగా పనులు చేయాలంటే BD18,000 ఖర్చు అవుతుంది. దీంతో తక్కువ ఖర్చులో నాసిరకంగా పనులు పూర్తి చేసింది. నిబంధనలు ఉల్లంఘించటంతో మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ ఎంప్లాయ్ లో పని చేస్తున్న నిందితుడు సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. చర్యలు తీసుకోకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే..ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఉన్నతాధికారులను సంప్రదించింది. దీంతో వలపన్నిన ఉన్నతాధికారులు లంచం తీసుకుటుండగా ఎంప్లాయ్ ని అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువు కావటంతో హై క్రిమినల్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!