దుబాయ్:అదిరిపోయే ఫీచర్స్ 5జీ టెక్నాలజీ పోలీస్ పాట్రోలింగ్ కారు
- February 15, 2020
దుబాయ్:ప్రజలకు భద్రత అందించటంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న దుబాయ్..పాట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. ఇందుకోసం అదిరిపోయే ఫీచర్స్ తో 5జీ టెక్నాలజీ ఫస్ట్ పెట్రోలింగ్ కారును దుబాయ్ పోలీసులకు అందుబాటులోకి తెచ్చింది. ఎతిసలాట్ కోఆపరేషన్ తో ఈ స్మార్ట్ పెట్రోలింగ్ కారును అధికారికంగా ప్రారంభించింది. దీంతో మిడిల్ ఈస్ట్, నార్త్ అఫ్రికా రిజీయన్ లో పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు 5జీ టెక్నాలజీ ద్వారా నేరుగా కమాండ్ కంట్రోల్ కు కనెక్ట్ చేయబడ్డాయి. దుబాయ్ పోలీసులు 5జీ సర్వీస్ గోల్ సాధించేందుకు ఎంతగానో కృషి చేయాల్సి వచ్చిందని బ్రిగేడియర్ ఖలేద్ నాస్సేర్ అల్ రజూఖీ తెలిపారు. 5జీ టెక్నాలజీతో నేరాల అదుపులో పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశాలు మరింత మెరుగుపడతాయని వివరించారు. పెట్రోలింగ్ కారులో అమర్చిన కెమెరాలు అత్యాధునికమైనవని, హై రెసెల్యూషన్ తో విజువల్స్ ను కమాండ్ కంట్రోల్ రూంకు పంపించ వచ్చన్నారు. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఫీచర్స్ తో ఎమిరాతి ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!