డెబిట్ కార్డ్ స్కామ్: జీతాల్ని కోల్పోయిన కార్మికులు
- February 15, 2020
రస్ అల్ ఖైమా:ముగ్గురు ఆసియా జాతీయులు, రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తమ డెబిట్ కార్డులపై పూర్తి అవగాహన లేని కార్మికుల్ని నిందితులు మోసం చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. రస్ అల్ ఖైమా పోలీస్ స్టేషన్లో పలువురు కార్మికులు, తమ ఖాతాల్లోని జీతం మాయమైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడమెలాగో తమకు తెలియదనీ, ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్ బయట నిల్చుని, తమకు సాయం చేస్తానన్నాడనీ, అతన్ని నమ్మి మోసపోయామని బాధితులు చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, నిందితుల ఆచూకీని కనుగొన్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!