దుబాయ్ ఎక్స్ పో 2020 కోసం శరవేగంగా రోడ్ల నిర్మాణం
- February 16, 2020
దుబాయ్:ఆరు లైన్ల విశాలమైన రోడ్లు, లింక్ రోడ్లు, ప్లైఓవర్స్ తో దుబాయ్ ఎక్స్ పో 2020కి వెళ్లే రహదారులు సిద్ధమవుతున్నాయి. ఎక్స్ పో ప్రారంభం నాటికి రోడ్ పనులను పూర్తిచేసేలా శరవేగంగా వర్క్ జరుగుతోంది. దుబాయ్ ఎక్స్ పో 2020కి వచ్చే విజిటర్స్ కి సౌకర్యవంతమైన రవాణా కల్పించటమే లక్ష్యంగా రహదారులను సిద్ధం చేస్తున్నారు. 43 కిలోమీటర్ల మేర చేపట్టిన కొత్త రోడ్లు, ఫ్లైఓవర్స్ ఉన్న రోడ్ నెట్వర్క్ దుబాయ్ లోనే అతిపెద్ద ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ అని రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. మొత్తం ఆరు విభాగాలుగా పనులు చేపడుతున్నారు. నాలుగు లైన్ల రోడ్డును ఆరు లైన్లకు పెంచుతున్నారు. మలుపులు, క్రాసింగ్ ల దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఆరు లైన్ల తో రెండు బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీంతో ఎక్స్ పో నుంచి షేక్ జయాద్ వేళ్లే రోడ్డులో ట్రాఫిక్ మూమేంట్ ఈజీ కానుంది. అంతేకాదు ఒక గంటలో 60 వేల వాహనాలు సులభంగా వెళ్లే లక్ష్యంతో రహదారుల విస్తరణ చేపట్టారు. షేక్ బిన్ జయద్ నుంచి అబుదాబికి వెళ్లే దారిలోనూ వాహనాల రాకపోకలు మరింత సులభతరం చేస్తూ రోడ్లను విస్తరిస్తున్నారు. అంతేకాదు ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గనుంది. ఈ కొత్త ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ తో అల్ హౌద్ ఇంటర్చేంజ్ నుండి అల్ మక్తూమ్ విమానాశ్రయానికి 35 నిమిషాలు పట్టే సమయం ఏకంగా 6 నిమిషాలకు తగ్గనుంది. ఈ మెగా ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ పో ప్రారంభానికి అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







