యూఏఈ: ట్రాఫిక్ ఫైన్స్ పై 50% డిస్కౌంట్...ఇవాళ్టి నుంచి అమలు

- February 16, 2020 , by Maagulf
యూఏఈ: ట్రాఫిక్ ఫైన్స్ పై 50% డిస్కౌంట్...ఇవాళ్టి నుంచి అమలు

యూఏఈ:వాహనదారులు ట్రాఫిక్ ఫైన్లు క్లియర్ చేసుకునేందుకు అజ్మన్ పోలీసులు మరో అవకాశం కల్పించారు. జనవరి 31, 2020కి ముందు విధించిన ఫైన్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచే డిస్కౌంట్ అవకాశం అమల్లోకి రానుంది. ఈ అఫర్ పిరియడ్ లో ఫైన్స్ క్లియర్ చేసుకునే వారికి బ్లాక్ పాయింట్స్ ను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. అలాగే వెహికిల్స్ పై ఇంపౌండ్మెంట్ ఫీజును కూడా క్లియర్ చేస్తారు. ఈ మేరకు అజ్మన్ పోలీసులు తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వివరాలు వెల్లడించారు. అజ్మన్ పోలీస్ యాప్, సహల్ డివైజ్ ద్వారా ఫైన్ చెల్లించవచ్చు. లేదంటే సర్వీస్ సెంటర్స్ లో వాహనదారులు నేరుగా ఫైన్స్ క్లియర్ చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com