దుబాయ్:ఎక్స్ ఫియాన్సీ కారును డ్యామేజ్ చేసిన వ్యక్తి అరెస్ట్
- February 16, 2020
దుబాయ్:వాలెంటైన్స్ కిక్ నుంచి యూత్ ఇంకా తేరుకోనేలేదు. పంచుకున్న ప్రేమ బాసలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. తేడాలోస్తే ప్రేమ ప్లేసులో పగ పెరుగుతుంది. రోజా పూలు ముళ్లు అవుతాయి. పూలు ఇచ్చిన చేతులతోనే రాళ్లు వేసేంత కసి పెరుగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చుకున్న కానుకల విషయంలోనూ గొడవలు చెలరేగుతాయి. దుబాయ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎక్స్ ఫియాన్సీ పై పగ పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె కుటుంబానికి చెందిన మూడు కార్లపై లిక్విడ్ కెమికల్ పోసి డ్యామేజ్ చేశాడు. రాత్రి వేళ మోటార్ బైక్ పై వచ్చి లిక్విడ్ కెమికల్ చల్లి వెళ్లిపోయారు.
తెల్లవారుజామున ఎక్స్ ఫియన్సీ కుటుంబసభ్యులు కార్లు డ్యామేజ్ అవటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. డ్యామేజ్ చేసింది ఎవరో తెలియక దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలించటంతో ముగ్గురు వ్యక్తులు వచ్చి కెమికల్ లిక్విడ్ చల్లినట్లు తేలింది. అయితే..ముగ్గురు మాస్క్ లు ధరించటంతో వాళ్లను గుర్తించటం కష్టంగా మారింది. అయితే..అత్యాధునిక టెక్నాలజీ సాయంతో వాళ్లలో ఒకర్ని పబ్లిక్ ప్లేసులో గుర్తించారు. ఫిజికల్ అప్పీయరెన్స్, డ్రెస్ మ్యాచ్ కావటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి మిగిలిన ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో నేరం అంగీకరించిన వ్యక్తి...తన ఎక్స్ ఫియాన్సిపై కోపంతోనే కార్లను డ్యామేజ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ఇచ్చిన గిఫ్ట్స్, మనీ విషయంలో గొడవ జరగటంతో ఆమెపై పగను పెంచుకున్నట్లు అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







