ట్రంప్ పర్యటనపై కన్నేసిన జేషే ఉగ్రవాద సంస్థ
- February 17, 2020
ట్రంప్ టూర్‌పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడులు చేస్తామంటూ ఏకంగా ఓ వీడియోనే విడుదల చేసింది. దీంతో.. ట్రంప్ టూర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది భారత సర్కార్..
జగడాల మారి పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు..సరికదా..ఏకంగా ట్రంప్ టూర్‌ని బేస్ చేసుకుని హెచ్చరికలకు దిగుతోంది. తాను వెనకుండి నడిపించే..జైషే మహ్మద్ చేత ఓ బెదిరింపు వీడియో విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం భారత్‌లో ముస్లింలను వేధిస్తున్నందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ జైషే మహ్మద్ హెచ్చరించడం ఇప్పుడు కలకలం రేపుతోంది..
ఖురాన్ షరీఫ్ అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో మేమిప్పటిదాకా శాంతంగా ఉన్నాం.. ఇక ఉపేక్షించేది లేదు..ప్రతి తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే అంటూ చెప్పడం కన్పిస్తుంది.. పుల్వామా అటాక్ తర్వాత జైషే మహ్మద్ స్థావరాలపై భారత్ చేసిన మెరుపుదాడులు చేయడంతో.. ఆ సంస్థ చావు దెబ్బ తిన్నది.. చింత చచ్చినా పులుపు చావ లేదన్నట్లుగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన సందర్భంగా ఏదో విధ్వంసం సృష్టిస్తే.. ప్రపంచం దృష్టిని ఆకర్షించ వచ్చనేది జైషే మహ్మద్ వ్యూహంగా కన్పిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో అశాంతి.. అస్థిరత నెలకొన్నదని చెప్పడానికే జైషే మహ్మద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. జైషే మహ్మద్ హెచ్చరికలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ఇంటలిజెన్స్ వర్గాలు.. గతవారం పీఓకేలో టెర్రరిస్టు సంస్థలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయని పసిగట్టిన భారత నిఘా టీమ్స్.. ఆ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై ఆరా తీశాయి. అప్పుడే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ కార్యకలాపాలు తిరిగి కశ్మీర్ లోయలో జీవం పోసుకోవాలని.. అందుకు తగిన ఆర్ధిక సాయం అందేలా ఐఎస్ఐ..పాకిస్తాన్ మిలటరీ వ్యూహం పన్నాయని తేలింది.
జైషే మహ్మద్ ప్లాన్‌లో భాగంగా కశ్మీరీ మిలిటెంట్లకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని.. పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రం ఈ ఆపరేషన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. లష్కరే తోయిబా కానీ..జైషే మహ్మద్ సంస్థలనుంచి కావాల్సిన సాయం పొందుతూ..ఉగ్రవాద కార్యకలాపాలను హిజ్బుల్ ముజాహిద్దీన్ ముందుకు తీసుకెళ్లడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం. అయితే.. ట్రంప్ పర్యటన సమయంలో గుజరాత్లో భారీగా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, ఇతర ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా జమ్ము కశ్మీర్లో పోలీసులు..భద్రతదళాలు, సాధారణ పౌరులు..ఇలా ఎవరు దొరికితే వారిపై దాడులు చేయడమే జేైషే మహ్మద్ తాజా వ్యూహం. వీటితో పాటే ఆత్మాహుతి దాడులకూ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







